

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న హారర్ థ్రిల్లర్ '418'ను జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. బ్లాక్బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కీర్తన్ నడగౌడ కథ, దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో కొనసాగుతున్నాయి.

సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితమైన హారర్ అనుభూతిని అందించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచగా, విడుదలకు ముందు మరిన్ని అప్డేట్లు, ప్రమోషనల్ కార్యక్రమాలను వరుసగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. చిత్రానికి వెంకీ జీజీ సంగీతం అందించగా, దినేష్ దివాకర్ ఛాయాగ్రహణం అందించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!