

నందమూరి బాలకృష్ణ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మాస్ యాక్షన్ డ్రామాకు ‘కార్పెంటర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథలోని ప్రధాన సామాజిక అంశానికి అనుగుణంగా ఈ పేరును ఎంపిక చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గ భారీ యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకు కూడా కథలో ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.
ఈ చిత్రం కీలక షెడ్యూల్ ఆగస్టు చివరి వారంలో ప్రారంభం కానుంది. ఇందులో బాలకృష్ణపై సుమారు 20 రోజులపాటు భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక సందేశాన్ని సమతుల్యంగా మేళవించే కథను కొరటాల శివ సిద్ధం చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!