

67వ పుట్టినరోజు సందర్భంగా నందమూరి బాలకృష్ణ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి విస్తరణకు సంబంధించిన కీలక ప్రకటనలు చేశారు. తమ తల్లి బసవతారకం ఆశయాలకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నార్త్ బ్లాక్ విస్తరణ చేపట్టనున్నట్లు వెల్లడించిన ఆయన, అమరావతి పరిధిలోని తుళ్లూరులో రూ.650 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కొత్త ఆస్పత్రి తొలి దశ 2028 నాటికి పూర్తవుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా వయసు గురించి మాట్లాడిన బాలకృష్ణ, “వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే” అని వ్యాఖ్యానించారు. తనను అంకుల్ లేదా తాత అని పిలిస్తే వారి పని అంతేనంటూ సరదాగా స్పందించారు. పని చేయడానికి వయసుతో సంబంధం లేదని, నిరంతరం కృషి చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చురుకుగా కొనసాగుతున్న ఆయన హిందూపూర్ ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కొనసాగుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!