

భారత యువ స్క్వాష్ సంచలనం అనహత్ సింగ్ వరల్డ్ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్లో ఈజిప్ట్‌కు చెందిన బార్బ్ సమేహ్‌పై 11-3, 8-11, 11-4, 11-6తో విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. తొలి గేమ్‌ను సునాయాసంగా సొంతం చేసుకున్న అనహత్.. రెండో గేమ్‌ను కోల్పోయినప్పటికీ అద్భుతంగా పుంజుకుంది. తర్వాతి రెండు గేమ్‌లలో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
ఈ విజయంతో 2005లో జోష్న చిన్నప్ప తర్వాత వరల్డ్ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా అనహత్ నిలిచింది. రెండు దశాబ్దాల తర్వాత భారత్‌కు ఈ ఘనత అందించిన అనహత్.. తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఫైనల్లో ఈజిప్ట్‌కు చెందిన రుకయ్యా సలీమ్‌తో తలపడనున్న అనహత్.. చారిత్రక టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!