

‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన యువ నటుడు అఖిల్ రాజ్ ఇప్పుడు ఓ వైరల్ వీడియో కారణంగా వార్తల్లో నిలిచారు. ఫుడ్ డెలివరీ ఉద్యోగితో జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చిన్న అపార్థంగా మొదలైన విషయం పెద్ద వివాదంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందనే అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది.
సమాచారం ప్రకారం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఆహారం బదులుగా వేరే ఆర్డర్ అందడంతో అఖిల్ రాజ్ అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. తన పొరపాటును డెలివరీ ఉద్యోగి ఒప్పుకుని క్షమాపణలు చెప్పినప్పటికీ పరిస్థితి సద్దుమణగలేదని వైరల్ వీడియోలో కనిపిస్తోంది. అఖిల్ రాజ్ అతనిపై దాడికి యత్నించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు బాధితుడు తనకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!