

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం రాకా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఆకాశంలో ఒక తార సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాకా సినిమా గురించి మాట్లాడుతూ.. అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోందని అంగీకరించారు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఎలాంటి అసంతృప్తి వ్యక్తం కాకుండా, అందరికీ నచ్చేలా అత్యుత్తమ కంటెంట్ అందించాలనే లక్ష్యంతో చిత్ర బృందం కష్టపడుతోందని తెలిపారు.
సినిమా కోసం అభిమానులు మరికొంత ఓపిక పట్టాలని అల్లు అర్జున్ విజ్ఞప్తి చేశారు. తప్పకుండా మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆకాశంలో ఒక తార చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా 2026 నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది. లైట్ బాక్స్ మీడియా, స్వప్న సినిమాస్, వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. రాకా గురించి అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలతో ఈ సినిమాపై అభిమానుల్లో మరోసారి ఆసక్తి పెరిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!