

ప్రముఖ నటుడు ధనుష్ హీరోగా నటిస్తున్న ‘ఓ.ఎం. (ఆపరేషన్ మోల్)’ సినిమాలో సాయిపల్లవి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె నిత్యా రెడ్డి అనే ఐపీఎస్ అధికారిణిగా కనిపించనున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మమ్ముట్టి కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. తన పాత్రకు పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సాయిపల్లవి జుట్టును పొట్టిగా కత్తిరించుకున్నారు. అయితే ఆమె కొత్త లుక్ చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత తల్లికి వీడియో కాల్ చేయగా, తన షార్ట్ హెయిర్ చూసి ఆమె షాకై వెంటనే కాల్ కట్ చేశారని సాయిపల్లవి తెలిపారు. ఆ తర్వాత తండ్రి కూడా విగ్ పెట్టుకున్నావా అని అడిగారని, తాను నిజంగానే జుట్టు కత్తిరించుకున్నానని చెప్పడంతో ఆయన తల్లికి నచ్చజెప్పడానికి కొన్ని రోజులు పట్టిందని వివరించారు. మరో దర్శకుడు అడిగితే ఇలాంటి మార్పుకు అంగీకరించేదాన్ని కాదని, రాజ్‌కుమార్ పెరియసామిపై ఉన్న నమ్మకంతోనే ఒప్పుకున్నానని చెప్పారు. తన పాత్రకు రిఫరెన్స్‌గా ఐపీఎస్ అధికారిణి మెరిన్ జోసెఫ్ ఫొటోలను దర్శకుడు చూపించారని వెల్లడించారు. ఈ సినిమా నవంబర్ 20న విడుదల కానుంది. తొలుత ‘ఓం’గా నిర్ణయించిన టైటిల్‌ను సెన్సార్ బోర్డు సూచన మేరకు ‘ఓ.ఎం. (ఆపరేషన్ మోల్)’గా మార్చారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!