
జనరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రాకా’ ముంబై షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ముంబై షెడ్యూల్ పూర్తవడంతో అల్లు అర్జున్ హైదరాబాద్‌కు తిరిగి చేరుకున్నట్లు తెలుస్తోంది. కొద్దిపాటి విరామం అనంతరం సెప్టెంబర్‌లో తదుపరి షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొననున్నారని సమాచారం. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!