

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 6 నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుండగా, ఇప్పటికే షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ 15 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇందులో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది సామాన్యులు ఉండనున్నారని టాక్. కొన్ని ఎలిమినేషన్స్ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా మరికొందరు సెలబ్రిటీలు, సామాన్యులు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారని సమాచారం.
ఇక సామాన్యుల ఎంపిక కోసం ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ షోకు నవదీప్, అభిజిత్, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తుండగా, శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘అగ్నిపరీక్ష’కు ఎంపికైన కంటెస్టెంట్లకు మొత్తంగా రూ.50 వేల రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంపికైన వారికి వారానికి రూ.70 వేల చొప్పున చెల్లించనున్నట్లు సమాచారం. ఈ లెక్కన బిగ్ బాస్‌లోకి వెళ్లే సామాన్యులకు ఫేమ్‌తో పాటు మంచి రెమ్యూనరేషన్ కూడా దక్కే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!