
జనరల్

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల తన వైవిధ్యమైన పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇటీవల ‘లేచిందీ మహిళా లోకం’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆమె ఇప్పుడు ‘లీసా’ అనే సైకలాజికల్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. ఈ సినిమాను జవహర్ లాల్ రాజు దర్శకత్వంలో ఓంశ్రీరామ్ ఆర్ట్స్, ఐరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై వెంకట్ దుగ్గిరెడ్డి, ఇలా రామకృష్ణ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అనన్య నాగళ్ల గాయాలతో, రక్తపు మరకలతో అత్యంత భయానకంగా కనిపిస్తూ అందరిని ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ఆమె ‘లీసా’ అనే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఇది ఒక షాకింగ్ అవతారంగా ఉండనుందని సమాచారం. పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!