

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని, కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్‌ను ఆయన వివాహం చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవంబర్ 10, 11 తేదీల్లో గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే చెన్నైలో పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనిరుధ్‌కు సంబంధించి మరో వార్త సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ‘కింగ్’ సినిమా నుంచి అనిరుధ్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో సంగీత ద్వయం సచిన్–జిగర్‌ను తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దక్షిణాదిలో పలు సినిమాలతో బిజీగా ఉండటంతో ‘కింగ్’కు అవసరమైన సమయం కేటాయించడం కష్టమవుతోందని, అందుకే ఈ మార్పు జరిగినట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఈ నిర్ణయం చిత్రబృందం తీసుకుందా, అనిరుధ్ స్వయంగా తప్పుకున్నారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమాలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాణి ముఖర్జీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల కానున్నట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!