

టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఎల్లమ్మ’పై అంచనాలు పెరుగుతున్నాయి. ‘బలగం’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు యెల్దండి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, తాజాగా ఈ సినిమా సంగీతానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను చిత్రబృందం వెల్లడించింది.
ఈ సినిమాలో నటించడంతో పాటు సంగీతాన్ని కూడా అందిస్తున్న డీఎస్పీ, టైటిల్ సాంగ్ కోసం ప్రత్యేక ప్రయోగం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 100 మంది సంప్రదాయ జానపద రిథమ్ కళాకారులతో ఈ పాటను రికార్డ్ చేశారు. భారతీయ సంస్కృతి, ప్రాంతీయ జానపద సంగీతంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా ఈ పాటను రూపొందించినట్లు సమాచారం. ఈ గీతాన్ని త్వరలోనే సినిమా ఫస్ట్ సింగిల్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!