

వరుస విజయాలతో మంచి జోరు మీదున్న స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాల విషయంలో ఆసక్తికరమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ‘సీన్’ భారీ విజయాన్ని అందుకోవడంతో ఆయనకు మరిన్ని అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘మండాడి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మతిమారన్ పుగళేంధితో సూర్య చేతులు కలపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కలయికలో ఓ భారీ తీరప్రాంత నేపథ్య యాక్షన్ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.
ఈ ప్రాజెక్టు సాధారణ యాక్షన్ కథలా కాకుండా, సముద్ర తీర ప్రాంతాల నేపథ్యంలో ఉత్కంఠభరితంగా సాగుతుందని ప్రచారం వినిపిస్తోంది. ఇప్పటికే కథా చర్చలు కూడా జరిగినట్లు సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ‘సీన్’ విజయంతో మంచి ఉత్సాహంలో ఉన్న సూర్య, మరోసారి వైవిధ్యమైన కథను ఎంచుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దర్శకుడు, హీరో కలయికపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే సూర్య అభిమానులకు మరో భారీ ప్రాజెక్టు దొరికినట్టే. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!