

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ గ్రీస్‌లో వివాహం చేసుకోబోతున్నారనే వార్తల నేపథ్యంలో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఈ క్రమంలో అనిరుధ్, కావ్యకు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేస్తున్నట్లుగా కనిపించే ఓ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో అనిరుధ్‌ను పోలిన వ్యక్తి, కావ్యను పోలిన యువతి అందమైన గ్రీక్ లొకేషన్‌లో చేతులు పట్టుకుని నడుస్తూ కనిపిస్తారు. అనంతరం అతను ఆమెను సరదాగా తిప్పి, ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని మెరిసే డైమండ్ రింగ్‌ను బయటకు తీసి ఆమె వేలికి తొడుగుతాడు. ఈ దృశ్యాలు నిజమైన ప్రపోజల్ వీడియోగా భావించిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, ఈ వీడియోను తొలుత షేర్ చేసిన ఖాతానే ఇది ఏఐ సాయంతో రూపొందించిన వీడియో అని స్పష్టం చేసింది. దీంతో ఈ క్లిప్ అనిరుధ్ నిజంగా కావ్యకు ప్రపోజ్ చేసిన దృశ్యం కాదని తేలింది. ‘అనీ తన ప్రేమకథకు తానే సంగీతం అందించాడు’ అంటూ వీడియోతో పాటు చేసిన పోస్ట్ కూడా వైరల్ అయింది.
మరోవైపు, నవంబర్ 10న గ్రీస్‌లో అనిరుధ్, కావ్య సంప్రదాయ తమిళ పద్ధతిలో నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. నవంబర్ 11న వీరి వివాహం జరగనున్నట్లు కూడా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ వేడుకలకు సూపర్‌స్టార్ రజనీకాంత్, ఆయన కుమార్తె ఐశ్వర్య, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ తదితర ప్రముఖులు గ్రీస్‌కు వెళ్లినట్లు సమాచారం. అయితే, వేడుకలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇరు కుటుంబాలు అధికారికంగా వెల్లడించలేదు. నవంబర్ 21న చెన్నైలోని ఐటీసీ హోటల్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గ్రీస్‌లో జరుగుతున్న వేడుకలకు సంబంధించిన అసలైన ఫొటోలు, వీడియోల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!