

టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న యువ కథానాయిక మానస వారణాసి మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకుంది. ‘దేవకి నందన వాసుదేవ’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఆమె ఇటీవల విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’తో భారీ విజయాన్ని అందుకుంది. వరుసగా వచ్చిన సినిమాలతోనే యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా మరో స్టార్ హీరో సరసన మానస నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘జార్జ్ క్రిష్’ చిత్రంలో కథానాయికగా మానస వారణాసి ఎంపికైనట్లు వెల్లడించారు.
రాబోయే సంక్రాంతి సందర్భంగా ఈ తాజా జంటను వెండితెరపై చూడబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. స్టార్ దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!