

టాలీవుడ్‌లో ప్రస్తుతం రా అండ్ రస్టిక్ నేపథ్య కథలకు ప్రాధాన్యం పెరుగుతోంది. రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రంగస్థలం’ గ్రామీణ వాతావరణం, స్థానిక యాసతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ ‘పుష్ప’తో మాస్ పాత్ర, చిత్తూరు యాసను తెరపైకి తీసుకొచ్చారు. నాని ‘దసరా’ కూడా రస్టిక్ నేపథ్యంతో రూపొందింది. రామ్‌చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పెద్ది’తో పాటు అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ కూడా ఇలాంటి నేపథ్య కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఈ పరిణామాలతో స్టార్ హీరోలు రా అండ్ రస్టిక్ కథల వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నారనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇలాంటి కథలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ కనిపిస్తుండటంతో మరికొందరు హీరోలు, దర్శకులు కూడా ఈ తరహా కథలపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఒకే ఫార్ములా ఎక్కువకాలం కొనసాగితే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కొందరు దర్శకులు విభిన్న కథాంశాలు, కొత్త నేపథ్యాలతో సినిమాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!