
జనరల్

విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన తాజా తమిళ చిత్రం ‘బత్తా’ కంటెంట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాను అట్లీ సమర్పిస్తున్నారు. తెలుగులోనూ సినిమాను విడుదల చేయాలని ఓ అభిమాని కోరగా.. అట్లీ తెలుగులో “త్వరగా వస్తుంది అన్నయ్య” అంటూ స్పందించారు. దీంతో తెలుగు వెర్షన్ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదల తేదీని మాత్రం ఆయన వెల్లడించలేదు.
‘బత్తా’ తెలుగు వెర్షన్ థియేటర్లలో విడుదలవుతుందా లేదా నేరుగా ఓటీటీలోకి వస్తుందా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. మరోవైపు అట్లీ ప్రస్తుతం అల్లు అర్జున్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటిస్తున్న ‘రాకా’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రెండు చిత్రాలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!