

కొన్ని వారాలుగా ఆశించిన స్థాయిలో సందడి కనిపించని టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఆగస్టు నెల కొత్త ఉత్సాహాన్ని తీసుకురానుంది. చిన్న చిత్రాల నుంచి పాన్ ఇండియా సినిమాల వరకు వరుస విడుదలలు ఉండటంతో సినీ ప్రేక్షకులకు వినోదానికి కొదవ ఉండదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. థియేటర్లలో సినిమాల విడుదలలతో పాటు టీజర్లు, ట్రైలర్లు, ప్రత్యేక అప్‌డేట్లు కూడా వరుసగా విడుదల కానుండటంతో మొత్తం నెల సినీ సందడితో కళకళలాడనుంది.
ఆగస్టు 7న కొరియన్ కనకరాజు, అనకాపల్లి, కేజేక్యూ, డీసీ చిత్రాలు విడుదల కానుండగా, ఆగస్టు 14న విశ్వనాథ్ అండ్ సన్స్, అగధ, పల్లాబురుసు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆగస్టు 20న ఐ యామ్ గేమ్, ఖలీఫా విడుదల కానుండగా, 21న రవితేజ నటించిన ఇరుముడి థియేటర్లలోకి రానుంది. నెల చివర్లో యష్ నటించిన టాక్సిక్ ఆగస్టు 26న విడుదల కానుంది. అదే నెలలో ది ప్యారడైజ్ టీజర్, టాక్సిక్ ట్రైలర్, వారణాసి అప్‌డేట్, ఫౌజీ టీజర్ వంటి ప్రచార కార్యక్రమాలు కూడా అభిమానులను అలరించనున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!