

దశాబ్దాలుగా తన అద్భుతమైన హాస్యంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న లెజెండరీ నటుడు బ్రహ్మానందం ఇప్పుడు సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. సుమంత్ ప్రధాన పాత్రలో, సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌరాణిక సాహస థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర పేరు ‘బ్రహ్మ’. ఈ పాత్రకు సంబంధించిన ప్రత్యేక వీడియో గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో సంప్రదాయ వస్త్రధారణలో కనిపించిన బ్రహ్మానందం.. “అమ్మా వారాహి, మా మహేంద్రగిరిని కాపాడు తల్లీ” అంటూ భావోద్వేగంతో ప్రార్థిస్తున్న తీరు ఆకట్టుకుంది.
గ్లింప్స్‌లో బ్రహ్మానందం తన సాధారణ హాస్య ఛాయలకు పూర్తిగా భిన్నంగా, గంభీరమైన పాత్రలో కనిపించారు. మహేంద్రగిరి కొండ, అక్కడి వారాహి ఆలయం చుట్టూ దాగి ఉన్న పురాతన రహస్యాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఐశ్వర్య రాజేశ్, మాళవిక నాయర్, మీనాక్షి గోస్వామి కథానాయికలుగా నటిస్తుండగా, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. బ్రహ్మానందం ఈ విభిన్న పాత్రలో ఎలా మెప్పిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!