
క్రీడలు

రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నప్పటికీ, జాన్వీ పాత్రపై వస్తున్న విమర్శలు సోషల్ మీడియాలో కొనసాగుతున్నాయి. ఆమె పాత్ర చిత్రణపై ట్రోల్స్ పెరగడంతో దర్శకుడు బుచ్చిబాబు సన అధికారికంగా స్పందించారు.
ఎక్స్ వేదికగా ఆయన ప్రేక్షకుల భావోద్వేగాలను గౌరవిస్తున్నామని తెలిపారు. ఎవరినీ అవమానించాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుని, వివాదాస్పద సన్నివేశాలను ట్రిమ్ లేదా ఎడిట్ చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. భవిష్యత్తులో మరింత బలమైన మహిళా పాత్రలతో సినిమాలు తీస్తామని హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!