

ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్లానింగ్ శాఖ నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజల్లో గ్రామస్థాయి వరకు అవగాహన కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల మార్పులు తెలంగాణపై చూపే ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందిస్తున్నామని భట్టి తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే పగటి పూట సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచి స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ అమలు చేయడం ద్వారా విద్యుత్ వ్యయాన్ని తగ్గిస్తూ గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడుతున్నామని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!