
జనరల్

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ‘దృశ్యం-3’, ‘తుడరుమ్’ వంటి హిట్ సినిమాల తర్వాత ఆయన ఇప్పుడు కొత్త క్రైమ్ థ్రిల్లర్ ‘అతిమనోహరం’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను తరుణ్ మూర్తి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఆశిక్ ఉస్మాన్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో మోహన్‌లాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా, ఆయన భార్యగా మీరా జాస్మిన్ నటిస్తున్నారు. రతీష్ రవి కథ అందిస్తున్న ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24, 2026న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!