

కొత్తదనంతో కూడిన కథలు, విభిన్నమైన కాన్సెప్ట్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న హీరో కిరణ్ అబ్బవరం మరో ఆసక్తికరమైన చిత్రంతో ముందుకొస్తున్నారు. పౌర్ణమి ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘హత:’ సినిమాకు కిరణ్ అబ్బవరం సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అనూష్ గోరక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం, శివశంకర నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తనూజ పుట్టస్వామి, కుష్లూ మద్దాల, రెహమాన్, నమ్రిత ఎంవీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను సెప్టెంబర్ 18న విడుదల చేయనున్నట్లు కిరణ్ అబ్బవరం ప్రకటించారు. ‘‘ఇది కచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది’’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌తో పోస్టర్‌ను విడుదల చేశారు. రక్తంతో తడిసిన చెట్టు వేర్లపై తనూజ ఆందోళనగా కూర్చుని ఉండగా, వెనుక కుష్లూ మద్దాల, రెహమాన్, నమ్రిత అనుమానాస్పదంగా చూస్తున్నట్లు పోస్టర్‌లో కనిపించారు. ఈ విభిన్నమైన పోస్టర్ సినిమా కథ, జానర్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!