

నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 4 నుంచి ఓ పాకిస్థానీ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్‌కు రానున్నట్లు వచ్చిన ప్రకటన వివాదానికి దారితీసింది. ఈ సిరీస్‌ను భారత్‌లో ప్రసారం చేయకుండా అడ్డుకోవాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్, హనియా ఆమిర్, సమన్ అన్సారీ ఇందులో కీలక పాత్రలు పోషించారు. పాకిస్థానీ కంటెంట్‌ను భారత ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడంపై సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.
పుల్వామా దాడి తర్వాత పాకిస్థానీ నటీనటులు, కంటెంట్‌కు సంబంధించి భారత ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు నివేదిక పేర్కొంది. 2025 మే 8న సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జారీ చేసిన ఆదేశాలకు అన్ని ఓటీటీ వేదికలు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవాలని AICWA కోరింది. ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా శాశ్వత మార్గదర్శకాలను రూపొందించాలని విజ్ఞప్తి చేసింది. ఈ తరహా కంటెంట్ దేశ భావోద్వేగాలు, జాతీయ సమగ్రతపై ప్రభావం చూపవచ్చని సంఘం తన లేఖలో అభిప్రాయపడింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!