

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణ’లో రావణుడిగా యశ్ లుక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఆయన ధరించిన భారీ కాస్ట్యూమ్స్, ఆభరణాల గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాస్ట్యూమ్ డిజైనర్ సానియా సర్ధారియా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. యశ్ ధరించిన దుస్తులు, ఆభరణాల మొత్తం బరువు సాధారణంగా 16 నుంచి 20 కిలోల వరకు ఉండేదని తెలిపారు. లంకకు సంబంధించిన సన్నివేశాలు, వివాహ వేడుకల కోసం రూపొందించిన కొన్ని ప్రత్యేక దుస్తులు 30 నుంచి 33 కిలోల వరకు బరువు ఉండేవని చెప్పారు. ఆయన ధరించిన కిరీటం ఒక్కటే సుమారు 1.8 కిలోలు ఉంటుందని వెల్లడించారు.
రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటించిన ఈ చిత్రం నవంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. అందించిన కలెక్షన్ల వివరాల ప్రకారం, భారత్‌లో ఇప్పటివరకు రూ.346.35 కోట్ల నెట్, రూ.413.90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. విదేశాల్లో ఐదో రోజు రూ.25 కోట్లు రాబట్టినట్లు సమాచారం. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం గ్రాస్ వసూళ్లు రూ.664 కోట్లకు చేరాయి. 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘ధురంధర్ 2’, ‘జైలర్ 2’ తర్వాత మూడో స్థానంలో నిలిచింది. ఈ చిత్రంలో యశ్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, లారా దత్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!