

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్న ఈ సినిమా మరోసారి లీకుల బారిన పడింది. ఇప్పటికే మహేశ్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్‌లకు సంబంధించిన షూటింగ్ క్లిప్ బయటకు రాగా, తాజాగా మహేశ్ బాబు యాక్షన్ సీన్‌కు సంబంధించిన వీడియో క్లిప్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.
లీకైన క్లిప్‌లో మహేశ్ బాబు ఒంటినిండా రక్తంతో, ఇప్పటివరకు చూడని రేర్ అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అనధికారికంగా క్లిప్స్‌ను షేర్ చేస్తున్న కొన్ని అకౌంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. లీకులపై చిత్ర బృందం లీగల్ చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, అధికారిక గ్లింప్స్ విడుదల చేయాలని అభిమానులు రాజమౌళిని కోరుతున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!