
సినిమాలు

టాలీవుడ్‌లో సరికొత్త ప్రమోషన్ ట్రెండ్‌కు తెరలేపుతూ ‘హై’ మూవీ టీమ్ భారీగా తొలి పాటను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ఫనా’ను ఆగస్టు 10న ఒకేసారి 301 మందికి పైగా ఇన్‌ఫ్లుయెన్సర్స్ తమ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా విడుదల చేయనున్నారు. తెలుగులో ఒకే పాటను ఇంత భారీ సంఖ్యలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఒకేసారి విడుదల చేయడం ఇదే తొలిసారి అని చిత్ర బృందం తెలిపింది.
‘ఫనా’ పాట హృదయాలను హత్తుకునే మెలోడీతో పాటు ఆకట్టుకునే సంగీతంతో ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఆగస్టు 10న ఈ పాట విడుదలతో ‘హై’ మూవీ మ్యూజికల్ జర్నీ ప్రారంభం కానుంది. వినూత్న ప్రమోషన్‌తో పాటు పాటపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!