

మాస్ మహారాజా రవితేజ నటించిన భావోద్వేగభరిత కుటుంబ కథా చిత్రం ‘ఇరుముడి’ ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా విదేశీ మార్కెట్‌లో ఈ చిత్రానికి ప్రారంభ స్పందన ఆశాజనకంగా కనిపిస్తోంది. నార్త్ అమెరికా ప్రీ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే 25K డాలర్లకు పైగా వసూళ్లు నమోదైనట్లు సమాచారం. సాధారణంగా రవితేజ సినిమాలకు నార్త్ అమెరికాలో మార్కెట్ పరంగా పెద్దగా బలం కనిపించకపోయినా, ‘ఇరుముడి’ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండొచ్చని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సినిమాకు లభిస్తున్న స్పందన కొనసాగితే విడుదల తర్వాత మరిన్ని మంచి వసూళ్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించారు. బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్రలో కనిపించనుంది. సాయి కుమార్ కీలక పాత్ర పోషించగా, జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. సినిమా ఫలితంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!