

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా ఆగస్టు 21, 2026న భారత్లో విడుదలకు సిద్ధమైంది. అంతకుముందే ఓవర్సీస్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ తొలి స్పందనలను పంచుకుంటున్నారు.
‘ఇరుముడి’లో గతంలో హింసాత్మక జీవితాన్ని గడిపిన, మద్యానికి బానిసైన ఆటో డ్రైవర్, చిన్న వ్యాపారవేత్త తన కుమార్తెతో ప్రశాంతంగా జీవిస్తుంటాడు. కుమార్తె కోరిక మేరకు అయ్యప్ప దీక్ష చేపట్టి యాత్రకు బయలుదేరిన అతని జీవితంలో చోటుచేసుకునే మార్పులు, విశ్వాసం, విముక్తి, సమాజాన్ని కాపాడే ప్రయత్నాలే కథాంశంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా, సాయికుమార్, బేబీ నక్షత్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!