

టాలీవుడ్‌లో ప్రస్తుతం భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాల హవా కొనసాగుతోంది. యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్‌తో సినిమాలు తెరకెక్కుతున్నప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యే స్థానిక కమర్షియల్ వినోద చిత్రాల సంఖ్య కొంత తగ్గింది. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో సినిమా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ చిత్రం పూర్తిస్థాయి వినోదాన్ని అందిస్తుందని ఎన్టీఆర్ చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. ముఖ్యంగా అదుర్స్, బాద్‌షా చిత్రాల్లో తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న ఎన్టీఆర్‌ను మరోసారి అలాంటి వినోదాత్మక పాత్రలో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఆర్ఆర్ఆర్, దేవర, వార్ 2 వంటి భారీ చిత్రాలతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్‌కు ఈ ప్రాజెక్ట్ భిన్నమైన అనుభూతిని ఇవ్వనుంది. మరోవైపు ఎఫ్2, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలతో అనిల్ రావిపూడి తనదైన వినోదాత్మక శైలిని నిరూపించుకున్నారు. గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ స్థాయికి తగ్గట్టుగా కథను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నటుడిలోని కామెడీ కోణాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను రూపొందిస్తామని చెప్పారు. మరి ఈ ఇద్దరి కలయిక వింటేజ్ ఎన్టీఆర్‌ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుందా? తెలుగు కమర్షియల్ సినిమాలకు కొత్త ఊపునిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!