

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ ఒకటి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు. ఇందులో దీపిక పోషించిన సుమతి పాత్ర కథలో అత్యంత కీలకంగా నిలిచింది. అయితే ‘కల్కి 2’లో దీపిక స్థానంలో సాయి పల్లవి లేదా ఆలియా భట్ నటించబోతున్నారంటూ కొంతకాలంగా వార్తలు, పుకార్లు వైరల్ అవుతున్నాయి.
ఈ ఊహాగానాలపై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ‘కల్కి 2’లో దీపిక పోషించిన పాత్రను మరో నటితో భర్తీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. సుమతి పాత్ర మాత్రం సీక్వెల్‌లో కొనసాగుతుందని, అయితే ఆ పాత్రను ఎవరు పోషిస్తారనే విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉందని తెలిపారు. దీంతో దీపిక స్థానంలో సాయి పల్లవి లేదా ఆలియా భట్ నటిస్తున్నారంటూ వచ్చిన వార్తలకు ప్రస్తుతానికి చెక్ పడినట్లైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!