
రాజకీయాలు

కార్తీ కథానాయకుడిగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్దార్ 2 నుంచి తొలి సింగిల్ ‘మయిల్ వీర’ రేపు విడుదల కానుంది. ఈ పాటకు సంబంధించిన ప్రచార చిత్రంలో కార్తీ సంప్రదాయ వేషధారణలో చేతిలో ఈటె పట్టుకుని కనిపిస్తున్నారు. చుట్టూ నెమళ్లు, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే దృశ్యాలతో పోస్టర్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. దీంతో పాటలో మురుగన్ భక్తి, ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశాలు ఉండొచ్చనే ఆసక్తి నెలకొంది.
Sardar 2 చిత్రానికి పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్. లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ‘మయిల్ వీర’ ఫస్ట్ సింగిల్ ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!