28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వక్ఫ్ బోర్డు సమావేశం చట్టబద్ధతపై హైదరాబాద్ ఎంపీ అభ్యంతరం..

Writer: Chandrika 04:23 PM, 28 నవంబర్, 2026
వక్ఫ్ బోర్డు సమావేశం చట్టబద్ధతపై హైదరాబాద్ ఎంపీ అభ్యంతరం..

తెలంగాణ వక్ఫ్ బోర్డు నేడు నిర్వహించనున్న సమావేశం చట్టబద్ధతపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమావేశాన్ని వెంటనే వాయిదా వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా సంబంధిత అధికారులను కోరారు. 2022లో ఏర్పాటైన ప్రస్తుత వక్ఫ్ బోర్డులో మొత్తం 11 మంది సభ్యులు ఉండగా.. వారిలో ఆరుగురు ఎన్నికైన సభ్యులు, నలుగురు నామినేటెడ్ సభ్యులు ఉన్నారని గుర్తుచేశారు. అయితే, 2025 ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వచ్చిన ఉమేద్ చట్టం (UMEED Act)లోని సెక్షన్ 14 ప్రకారం బోర్డు సభ్యుల నియామక విధానంలో మార్పులు వచ్చాయని తెలిపారు. కొత్త చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం ఇద్దరు ఎన్నికైన సభ్యులు మాత్రమే తమ పదవీకాలం ముగిసే వరకు కొనసాగేందుకు అర్హులని పేర్కొన్నారు. నామినేటెడ్ సభ్యుల పదవులు రద్దయినట్లేనని వివరించారు.

కేవలం ఇద్దరు సభ్యులతో వక్ఫ్ బోర్డు సమావేశం నిర్వహించడం చట్టవిరుద్ధమని ఒవైసీ అభిప్రాయపడ్డారు. అలా నిర్వహించే సమావేశాలు ఉమేద్ చట్టంలోని సెక్షన్ 14ను ఉల్లంఘించినట్లవుతాయని పేర్కొన్నారు. చట్టబద్ధమైన సభ్యుల కూర్పు లేకుండా నిర్వహించే సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలకు ఎలాంటి చట్టబద్ధత, అధికారిక గుర్తింపు లేదా అమలు చేయగల బలం ఉండదని హెచ్చరించారు. ప్రస్తుత బోర్డు కూర్పుపై ఉన్న న్యాయపరమైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని నేటి సమావేశాన్ని తక్షణమే వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైదరాబాద్ ఎంపీ కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయం..

డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయం..

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు..

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు..

మహిళా రిజర్వేషన్లకు అడ్డంకులన్నీ తొలగిస్తాం.. ప్రతిపక్షాలు అడ్డుకోలేవు: ప్రధాని మోదీ

మహిళా రిజర్వేషన్లకు అడ్డంకులన్నీ తొలగిస్తాం.. ప్రతిపక్షాలు అడ్డుకోలేవు: ప్రధాని మోదీ

డీలిమిటేషన్ బిల్లుతో ఇండియా కూటమిలో విభేదాలు

డీలిమిటేషన్ బిల్లుతో ఇండియా కూటమిలో విభేదాలు

డీలిమిటేషన్‌పై ఇండియా కూటమి మూడు కీలక డిమాండ్లు

డీలిమిటేషన్‌పై ఇండియా కూటమి మూడు కీలక డిమాండ్లు

ట్యాగ్లు
అసదుద్దీన్ ఒవైసీహైదరాబాద్ ఎంపీతెలంగాణ వక్ఫ్ బోర్డువక్ఫ్ బోర్డు సమావేశంఉమేద్ చట్టం 2025సెక్షన్ 14తెలంగాణ ప్రభుత్వంవక్ఫ్ బోర్డు సభ్యులుహైదరాబాద్ రాజకీయాలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీలిమిటేషన్ బిల్లుకు రాష్ట్రపతి సిఫార్సు..
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుకు రాష్ట్రపతి సిఫార్సు..

వక్ఫ్ బోర్డు సమావేశం చట్టబద్ధతపై హైదరాబాద్ ఎంపీ అభ్యంతరం..
రాజకీయాలు

వక్ఫ్ బోర్డు సమావేశం చట్టబద్ధతపై హైదరాబాద్ ఎంపీ అభ్యంతరం..

డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయం..
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయం..

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు..
జనరల్

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు..

నిజామాబాద్‌లో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన..
జనరల్

నిజామాబాద్‌లో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన..

హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో సైబర్ మోసం..
జనరల్

హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో సైబర్ మోసం..

స్విట్జర్లాండ్‌లో మార్మోగిన అన్నమయ్య సంకీర్తన..
జనరల్

స్విట్జర్లాండ్‌లో మార్మోగిన అన్నమయ్య సంకీర్తన..

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు..
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు..

ఇక స్మార్ట్ టీవీల్లోనూ ఇన్‌స్టాగ్రామ్..
టెక్నాలజీ

ఇక స్మార్ట్ టీవీల్లోనూ ఇన్‌స్టాగ్రామ్..

మహిళా రిజర్వేషన్లకు అడ్డంకులన్నీ తొలగిస్తాం.. ప్రతిపక్షాలు అడ్డుకోలేవు: ప్రధాని మోదీ
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్లకు అడ్డంకులన్నీ తొలగిస్తాం.. ప్రతిపక్షాలు అడ్డుకోలేవు: ప్రధాని మోదీ

హరియాణా దాబా కాల్పుల కేసులో సంచలనం..
జనరల్

హరియాణా దాబా కాల్పుల కేసులో సంచలనం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!