

కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కోర్ట్‌రూమ్ డ్రామా ‘సత్తియవాన్ సావిత్రి’ విడుదల తేదీ ఖరారైంది. ప్రవీణ్ ఎస్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని కీర్తి సురేశ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఆమె న్యాయవాదిగా ప్రత్యర్థిని సవాల్ చేస్తున్న తీరు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

దర్శకుడు ప్రవీణ్ ఎస్. విజయ్ తెలిపిన వివరాల ప్రకారం, తన భర్త కేసులో న్యాయం కోసం పోరాడే సావిత్రి అనే న్యాయవాది చుట్టూ కథ సాగుతుంది. న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చే సావిత్రి, చట్టానికే కట్టుబడి ఉండే తన సీనియర్‌తో తలపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ‘హార్ట్ బీట్’ ఫేమ్ చారుకేశ్ కీర్తి భర్త పాత్రలో నటిస్తున్నారు. ఇదే సమయంలో కీర్తి సురేశ్ భారీ బడ్జెట్ రొమాంటిక్ థ్రిల్లర్ కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే రాజ్‌కుమార్ రావు తో కలిసి నటించిన ‘రఫ్తార్’ చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!