

ఫోక్ సాంగ్స్‌తో గుర్తింపు పొందిన నాగ దుర్గ హీరోయిన్గా కోలీవుడ్లోకి అడుగుపెడుతున్న చిత్రం 'లవ్ ఓ లవ్'. ఈ సినిమా అధికారిక ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 'ఇడుపు కాయితం' అనే ప్రత్యేక టైటిల్‌తో సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చనీయాంశమైన ఈ చిత్రం, "ప్రేమ అమూల్యమైనదే... కానీ ఆ ప్రేమలో పడితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది" అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో రూపొందినట్లు ట్రైలర్ సూచిస్తోంది. ప్రేమ, కామెడీ, భావోద్వేగాలు, యూత్‌ఫుల్ అంశాలతో కూడిన వినోదాత్మక చిత్రంగా ఇది కనిపిస్తోంది.
ఈ చిత్రంలో దినేష్ రాజ్, సెల్వరాఘవన్, కె.ఎస్. రవికుమార్, వనితా విజయ్‌కుమార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్లో నాగ దుర్గ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో ఆమె కోలీవుడ్ అరంగేట్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రైమ్ వీడియో, థింక్ మ్యూజిక్ భాగస్వామ్యంతో రూపొందిన ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!