
బిజినెస్

అథర్వ మురళి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన 'హృదయం మురళి' సినిమాలో మాళవిక మోహనన్ సర్‌ప్రైజ్ క్యామియోతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సంప్రదాయ తమిళ వధువు లుక్‌లో కనిపించిన ఆమె పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా షూటింగ్ సమయంలో తీసిన బీహైండ్ ది సీన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను ఆనందపరిచారు.
ఫహద్ ఫాజిల్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా అనిపించిందని, ఆయనతో పూర్తి స్థాయి సినిమా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందని మాళవిక తెలిపారు. అలాగే చిత్ర యూనిట్‌లోని యువతరంతో కలిసి పనిచేయడం తనకు కాలేజీ రోజులను గుర్తు చేసిందని చెప్పారు. ప్రస్తుతం ఆమె పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మంచి స్పందన అందుకుంటున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!