

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అరుదైన బాక్సాఫీస్ పోటీకి రంగం సిద్ధమవుతోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ నవంబర్ 20న వేర్వేరు భాషల సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న దుల్కర్.. దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంతో సందడి చేయనున్నారు. వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నవంబర్ 20న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
మరోవైపు మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం ‘ఓం’ (O.M) కూడా అదే రోజున విడుదల కానుంది. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాకు ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై కోలీవుడ్‌తో పాటు ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఉన్నాయి. ఇలా తండ్రీకొడుకులు ఒకే రోజున వేర్వేరు భాషల సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దుల్కర్ తెలుగు చిత్రంతో, మమ్ముట్టి తమిళ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!