

వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ, సమాజ సేవలో విశేష కృషి చేసిన తొమ్మిది మంది ప్రముఖులను రామోజీ గ్రూప్ ప్రతిష్ఠాత్మక పురస్కారాలతో సత్కరించనుంది. ఈ మేరకు రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులు ప్రదానం చేయడానికి ఏర్పాట్లు చేసింది. మీడియా దిగ్గజం, రామోజీ గ్రూప్ వ్యవస్థాపకుడు రామోజీరావు జయంతిని పురస్కరించుకుని విజయవాడలో నేడు ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. తమ తమ రంగాల్లో విశేష ప్రతిభ చూపడంతో పాటు సమాజంపై చెరగని ముద్ర వేసిన వ్యక్తులను గుర్తించి గౌరవించడమే ఈ పురస్కారాల ప్రధాన ఉద్దేశం.
ఈ వేడుకకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయన చేతుల మీదుగా తొమ్మిది మంది అవార్డు గ్రహీతలకు పురస్కారాలు అందజేయనున్నారు. ప్రతిభ, అంకితభావం, సేవా దృక్పథంతో సమాజానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తులను గౌరవించడం ద్వారా రామోజీరావు ఆశయాలను, ఆయన వారసత్వాన్ని స్మరించుకునేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రతిభావంతులకు గుర్తింపుగా నిలవనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!