

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘రామాయణ’లో ఆమె మండోదరి పాత్రలో కనిపించనున్నారు. సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజల్ సినీ పరిశ్రమలో నటీమణులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్‌పై ఏర్పడే అభిప్రాయాలు, వివక్షపై ఆమె మాట్లాడారు.
పెళ్లి తర్వాత హీరోయిన్ కెరీర్ ముగిసిపోయిందని చాలామంది భావించడం సరైంది కాదని కాజల్ అన్నారు. మంచి మార్కెట్, క్రేజ్ ఉన్నప్పటికీ కొందరు పెళ్లైన నటీమణులను పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిభ ఉన్న నటీమణులకు పెళ్లి లేదా వయసు అడ్డంకి కాకూడదని, టాలెంట్ ఉంటే ఏ వయసులోనైనా అద్భుతంగా నటించవచ్చని పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో ఇలాంటి వివక్ష త్వరలోనే మారాలని కాజల్ ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!