
జనరల్

ప్రస్తుత రోజుల్లో సెలబ్రిటీల పేర్లను వాడుకుని సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. నటులు, నటీమణుల ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి అమాయకులను డబ్బు కోసం మోసం చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ లక్కీ బ్యూటీ మీనాక్షి చౌదరి కూడా ఇలాంటి మోసగాళ్ల లక్ష్యంగా మారింది. ఆమె పేరుతో ఫేక్ వాట్సాప్ నంబర్ సృష్టించి డబ్బులు అడుగుతున్నట్లు తెలిసింది.

ఈ విషయంపై మీనాక్షి చౌదరి ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులను అప్రమత్తం చేసింది. 7604891175 అనే నంబర్ తనది కాదని, ఆ నంబర్ నుండి వచ్చే మెసేజ్‌లు లేదా కాల్స్‌ను నమ్మవద్దని స్పష్టంగా తెలిపింది. ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలని కూడా కోరింది. ఆమె స్పందనతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!