

చాలామంది సినీ వారసులు నటనతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతుంటే, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ మాత్రం తొలుత దర్శకత్వంపై ఆసక్తి చూపించారు. సుదీప్ కిషన్ హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ చిత్రం సిగ్మాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత జేసన్ సంజయ్ నటుడిగా తెరంగేట్రం చేయబోతున్నారని, ఇందుకోసం కథలు వింటున్నారని వార్తలు వెలువడ్డాయి.
తాజాగా వినిపిస్తున్న ఇండస్ట్రీ బజ్ ప్రకారం, డ్యూడ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కీర్తీశ్వరన్, జేసన్ సంజయ్ హీరోగా తెరకెక్కబోయే తొలి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు, కీర్తీశ్వరన్ హీరో శింబుతో కూడా ఓ సినిమా చేయనున్నారు. ఆ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. జేసన్ సంజయ్ నటనారంగ ప్రవేశానికి సంబంధించిన తారాగణం, షూటింగ్ వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!