
జనరల్

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రబృందానికి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల నుంచి ప్రత్యేక అభినందనలు లభించాయి. బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్ర యూనిట్‌ను చిరంజీవి వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక భేటీతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా సమంత, రాజ్ నిడిమోరు, దర్శకురాలు నందిని రెడ్డిని చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న చిత్రాన్ని అందించినందుకు ప్రశంసలు కురిపిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మెగాస్టార్ నుంచి వచ్చిన ఈ ప్రశంసలు ‘మా ఇంటి బంగారం’ టీమ్‌కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!