
సినిమాలు

‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించి ఇటీవల జరుగుతున్న చర్చలపై దర్శకురాలు నందిని రెడ్డి స్పందించారు. సినిమా కథ చెప్పే సమయంలోనే పాత్రకు సంబంధించిన ప్రతి అంశాన్ని నటీనటులకు వివరంగా తెలియజేస్తారని, ఆ తర్వాతే వారు సినిమాలో నటించేందుకు అంగీకరిస్తారని ఆమె పేర్కొన్నారు. ఒక పాత్రపై అసౌకర్యంగా భావిస్తే నటీమణులు ఆ అవకాశాన్ని తిరస్కరించే స్వేచ్ఛ కూడా కలిగి ఉంటారని చెప్పారు.
పాత్రల ఎంపిక విషయంలో మొత్తం బాధ్యతను దర్శకులు లేదా నిర్మాతలపై మోపడం సరికాదని నందిని రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో చాలామంది నటీమణులు తమకు నచ్చని పాత్రలను తిరస్కరించిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేశారు. పారితోషికం తీసుకుని స్వచ్ఛందంగా సినిమాల్లో నటిస్తున్నప్పుడు నిర్ణయానికి సంబంధించిన బాధ్యత కూడా అందరిదేనని ఆమె స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!