
రాజకీయాలు

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనను స్మరించుకున్నారు. ఏఎన్నార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగంగా స్పందించారు. క్రమశిక్షణ, అంకితభావానికి ఏఎన్నార్ ప్రతీకగా నిలిచారని కొనియాడిన చిరంజీవి.. కొందరు నటులు తరాలను అలరిస్తే, మరికొందరు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. ఏఎన్నార్ ఈ రెండు కోవలకు చెందిన గొప్ప నటుడని అన్నారు.
ఏఎన్నార్‌తో కలిసి 1993లో ‘మెకానిక్ అల్లుడు’ చిత్రంలో నటించిన జ్ఞాపకాలను చిరంజీవి గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా తన సినీ ప్రయాణంలో ఓ విలువైన అధ్యాయమని పేర్కొన్నారు. ఏఎన్నార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సినిమాలు, పోషించిన పాత్రల ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటారని చిరంజీవి అన్నారు. ఆయన సినీ వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!