
సినిమాలు

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, పేదరికం మరియు వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో జరిగిన వివాహాలు, విడాకుల గురించి ప్రస్తావిస్తూ.. జీవితంలో మళ్లీ పేదరికాన్ని ఎదుర్కోవాలని తాను అస్సలు అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఆర్థిక భద్రత కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధమని ఆమె వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
అలాగే తన గ్లామర్, హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ గురించి మాట్లాడుతూ.. వాటి కోసం భారీగా ఖర్చు చేస్తానని తెలిపారు. డిప్రెషన్ గురించి అడిగిన ప్రశ్నకు కూడా తనదైన శైలిలో స్పందించిన రాఖీ.. డబ్బే తనకు అన్ని సమస్యలకు పరిష్కారమని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీశాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!