

భారతీయ సంగీత ప్రపంచంలో విశిష్ట స్థానం సంపాదించుకున్న గానకోకిల ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక బయోపిక్‌లో రష్మిక మందన్న నటించనుంది. ఈ సినిమా చెన్నైలో ఘనంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. లెజెండరీ నటుడు, దర్శకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టి ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేశారు.
దాదాపు ఏడాది కాలంగా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం తమకు గొప్ప గౌరవంగా భావిస్తున్నామని నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాస్, రాక్‌లైన్ వెంకటేష్ తెలిపారు. లాంచ్ ఈవెంట్‌లో సంప్రదాయ చీరలో కనిపించిన రష్మిక, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి వంటి గొప్ప వ్యక్తి పాత్రను పోషించే అవకాశం కల్పించినందుకు మేకర్స్‌కు కృతజ్ఞతలు తెలిపింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, ఈ విజువల్ అండ్ మ్యూజికల్ వండర్‌ను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!