

తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ది ప్యారడైజ్’ ఒకటి. నేచురల్ స్టార్ నాని హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే దీనిపై భారీ ఆసక్తి నెలకొంది. నిర్మాణ పనుల్లో ఇంకా కొంత భాగం మిగిలి ఉన్నప్పటికీ, ప్రకటించిన విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని మేకర్స్ చెబుతున్నట్లు సమాచారం. దీంతో బయ్యర్లలోనూ సినిమాపై నమ్మకం పెరిగింది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్‌పై ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే ‘ది ప్యారడైజ్’ రూ.100 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఇలాంటి స్థాయి బిజినెస్‌ను తెలుగు ఇండస్ట్రీలో అగ్రశ్రేణి హీరోల సినిమాలతో అనుసంధానిస్తుంటారు. ఈ లెక్కల నేపథ్యంలో నాని మార్కెట్‌పై కూడా చర్చ మొదలైంది. అయితే ఈ బిజినెస్ అంచనాలకు అనుగుణంగా సినిమా థియేట్రికల్‌గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో విడుదల తర్వాతే స్పష్టమవుతుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!