

నభా నటేష్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రంలో తాను ఇప్పటివరకు చేయని బలమైన పాత్రలో కనిపిస్తానని తెలిపారు. అభిషేక్ నామా దర్శకత్వంలో, విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కుతున్న ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. 19వ శతాబ్దపు వాతావరణాన్ని ప్రతిబింబించేలా రూపొందిన ఈ సినిమాలో తాను ‘పార్వతి’ అనే వేద విద్యార్థిని పాత్రలో నటిస్తున్నానని, ఆ పాత్ర భావోద్వేగపూరితంగా ఎంతో బలంగా ఉంటుందని ఆమె చెప్పారు. కుటుంబం, ప్రేమ కోసం ఎంతవరకైనా పోరాడే వ్యక్తిత్వం ఆ పాత్రలో ఉందని, ప్రేక్షకులకు ఇది ఖచ్చితంగా సర్‌ప్రైజ్ ఇస్తుందని పేర్కొన్నారు.
ఈ చిత్రంలోని విజువల్స్, భారీ సెట్లు, వీఎఫ్‌ఎక్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయని నభా నటేష్ తెలిపారు. దాదాపు 5,000 మంది డ్యాన్సర్లతో రూపొందించిన గ్రాండ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, దర్శకుడు ప్రతి అంశాన్ని ఎంతో డీటెయిల్‌గా రూపొందించారని అన్నారు. సుమారు రూ.110 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాలో జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తన కెరీర్‌లో ప్రత్యేకమైన అనుభవంగా నిలుస్తుందని ఆమె వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!