

సూర్య కథానాయకుడిగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆడియో రిలీజ్ వేడుకలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన మాటలను అహంకారంగా భావించవద్దని కోరుతూ, ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు మళ్లీ 'గజినీ'లోని సంజయ్ రామసామి తరహా సూర్యను చూస్తారని అన్నారు. అంతేకాదు, ఈ చిత్రం తమిళంలో 'అల వైకుంఠపురములో' తరహా ఘన విజయాన్ని అందుకుంటుందనే పూర్తి నమ్మకం తనకు ఉందని తెలిపారు. అలాగే జెన్-జీ ప్రేక్షకులకు మమితా బైజు నటన ఎంతో నచ్చుతుందని, సూర్య, మమితా, రాధిక మధ్య వచ్చే ఓ కీలక సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు.
అయితే నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆయన ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించగా, మరికొందరు సినిమా విడుదలకు ముందే ఇలాంటి పోలికలు చేయడంపై ట్రోలింగ్ ప్రారంభించారు. మరోవైపు హీరో సూర్య మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని తనకు అందించినందుకు నాగవంశీకి కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు వెంకీ అట్లూరి తనకు మరో గుర్తుండిపోయే పాత్రను ఇచ్చారని అన్నారు. ఈ చిత్రంలో ప్రేమ, కుటుంబ అనుబంధాలు, హాస్యం, మాస్ ఎలివేషన్లు అన్నీ ఉంటాయని, ప్రేక్షకులు థియేటర్ నుంచి చిరునవ్వుతో బయటకు వస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!