

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై ‘ఓటుకు నోటు’ కేసులో సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. తమపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని రేవంత్‌రెడ్డి కోరగా, ఆయన తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. 2015లో జరిగిన ఘటనకు 2018లో సవరించిన అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలను వర్తింపజేయడం సాధ్యం కాదని ఆయన వాదించారు. అలాగే ఎఫ్‌ఐఆర్, జనరల్ డైరీ నమోదు అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
వాదనల సందర్భంగా ఓటు వేయడం చట్టబద్ధమైన హక్కు అని, ఆ ఓటును ప్రభావితం చేసిన సందర్భంలో అవినీతి నిరోధక చట్టం వర్తించే అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రేవంత్‌రెడ్డి తరఫు వాదనలు పూర్తయ్యాయి. తదుపరి విచారణలో బీఆర్‌ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం వాదనలు వినిపించనున్నారు. ఆయన అనారోగ్యం కారణంగా వాదనలు వాయిదా పడ్డాయని, తదుపరి విచారణ తేదీని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఖరారు చేయనుందని సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!